కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం స్థానిక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద గల, సిరి ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ పాఠశాలను, జిల్లా కలెక్టర్ షాన్మోహన్, స్థానిక తాసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి, శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి పేపర్ ప్లేట్ తయారీ యూనిట్ మరియు, క్లాత్ మేకింగ్ యూనిట్, దివ్యాంగ విద్యార్థుల వసతి గృహాలలో భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటర్ గోపిదేవితో ఆయన, పాఠశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.