వినాయక నవరాత్రుల అనంతరం శోభయాత్ర నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రజలందరూ సమన్వయంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లాలోని జైపూర్ మండలం ఇందారం సమీపంలోని గోదావరి వంతెన వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేష్ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో రూట్ మ్యాప్ రూపొందించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన గణేష్ మండళ్ల వివరాలను నమోదు చేయడం జరిగిందని, అన్నారు