భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన పహాడీషరీఫ్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. పహాడీషరీఫ్ ప్రాంతంలో ఉన్న ఇండిస్ట్రియల్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగిసిపడి దట్టమైన పొగ కమ్మేసింది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.