గురువారం మధ్యాహ్నం ఐడిఓసి కలెక్టర్ చాంబర్ నందు గ్రామ పాలనాధికారుల నియామక పత్రాలు కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీవోల నియామకాలను చేపట్టినట్లు తెలిపారు.భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో, నిబద్ధతతో న్యాయబద్ధంగా పని చేయాలని గ్రామ పరిపాలన అధికారులకు సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, సర్వే నంబర్లు, చెరువులు, కుంటలు, శిఖం భూములు, ఎఫ్టీఎల్,బఫర్ జోన్ల పర్యవేక్షణ.. తదితర ప్రభుత్వ పరిపాలన వ్యవహారాలన్నీ సమర్థవంతంగా పర్యవేక్షించాలన్నారు.