కలుషిత నీరు తాగి 8 మంది అస్వస్థతకు గురైన ఘటన శుక్రవారం గాదిగూడ మండలం లోకారి (బి)లో చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ సిబ్బంది కిషన్, ముజఫర్ తెలిపిన ప్రకారం లోకారి (బి) లో కలుషిత నీరు తాగి 8 మందికి అస్వస్థకు కావడంతో ప్రథమ చికిత్స అందించినట్లు వారు పేర్కొన్నారు. అనంతరం వారిని ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలించినట్లు వెల్లడించారు.