2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్ వైసీపీ అభ్యర్థి శాసనసభాపతి తమ్మినేని సీతారాంపై 33,285 ఓట్ల మెజారిటీ తేడాతో విజయం సాధించారు.