అన్నమయ్య జిల్లా. మదనపల్లి పట్టణ నడిబొడ్డులో ఉన్న కోమాటివాని చెరువు సమీపంలో బఫర్ జోన్ వ్యవసాయ కాలువను కొంతమంది ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ కు గురువారం వినతి పత్రాన్ని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ సమర్పించారు. ఆయన మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.