అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల కోటవురట్ల జంక్షన్లో ఆటో డ్రైవర్లు మంగళవారం భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన నేపథ్యంలో తామంతా ఉపాధి కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల యూనియన్ సభ్యుడు కొండలరావు మాట్లాడుతూ.. రోజుకు రూ.200 ఆదాయం రావడం లేదన్నారు. పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వాహన మిత్ర పథకం కింద ఏడాదికి రూ.25వేలు ఆర్థిక సహాయం చేయాలన్నారు.