ట్రాన్స్ఫార్మర్ పై ఆడుతూ కోతులు మృతి వివరాలు ఇలా ఉన్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని రుద్రంగి మండల కేంద్రంలోని మానాల ఎక్స్ రోడ్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు తగిలి దాదాపు 15 కోతులు మృతి చెందాయి.స్థానికులు తెలిపిన ప్రకారం కోతులు ఒకేసారి గుంపుగా వచ్చి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఆడుతూ ఉండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి కిందపడి చనిపోయాయని అన్నారు.హనుమంతుడుకి ఇష్టమైన శనివారం రోజునే పదుల సంఖ్యలో కోతులు చనిపోవడంతో ఆంజనేయస్వామి భక్తులు,జంతు ప్రేమికులు విచారం వ్యక్తం చేశారు.