విజయనగరంలోని బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ అనే 22 ఏళ్ల యువకుడు గణేష్ నిమజ్జనంలో డాన్స్ చేస్తూ మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా మృతుడు హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.డిగ్రీ పూర్తి చేసిన హరీష్ పోటీ పరీక్షలకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రిజర్వేషన్ చేయించుకున్నాడు. అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన హరీష్ ఇక లేడన్న సమాచారంతో బొబ్బాధిపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.డిజె సౌండ్స్ నిషేధించాలని ప్రజలు కోరుతున్నారు.