అనకాపల్లి జిల్లాలో ఆశా వర్కర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్ హైమావతి గురువారం తెలిపారు. అర్బన్ ప్రాంతంలో 12, రూరల్ ప్రాంతంలో 49 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 13 లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు 10వ తరగతి పాసై 25- 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలన్నారు. ఇంటర్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. వివరాల కోసం తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.