వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు రైతులు ఎరువుల కోసం లైన్ లో నిలబడి పడిగాపులు కాసిన పరిస్థితి నెలకొంది. లైన్లో ఓ మహిళ గంటల తరబడి నిలబడి పోలీసులు కొంత నెట్టి వేయడంతో అస్వస్థతకు గురైంది. దీంతో అందరూ బయటికి పోలీసులను వెళ్లాలంటే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. తాము వరి నాటు వేసి చాలా రోజులు అవుతుందని సమయం దాటితే పంట దిగుబడి రాదని ఇంతవరకు యూరియా వేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.