అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని జేసీ అభిషేక్ అన్నారు. గురువారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరులోని ఐటీడీఏ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలోని 430గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి కొంతమంది అనధికార లే-అవుట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీలలో అనుమతులు పొందకుండా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వాటిని నియంత్రించాలన్నారు.