ఆశా వర్కర్ లకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయు అనుబంధం) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పద్మ, సునీత డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయం నుండి ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి,కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు.