సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో దాదాపు 40,000 మంది జనాభా నివసిస్తున్నప్పటికీ, ప్రస్తుతం వారానికి ఒక్కరోజు కూడా త్రాగునీరు అందడం లేదని బి ఆర్ ఎస్ నాయకులు, నారాయణఖేడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ నజీబ్ తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చొరవతో బోరంచ మరియు పెద్దారెడ్డిపేట్ పంప్ హౌస్‌ల నుండి రోజుకు సుమారు 15 లక్షల లీటర్ల త్రాగునీరు సరఫరా అయ్యేదన్నారు. పెద్దారెడ్డిపేట్ నుండి అదనపు పైప్లైన్లను వేయించి మున్సిపాలిటీకి తగినంత నీటిని అందించారని తెలిపారు. ప్రస్తుతం తాగునీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.