అశ్వారావుపేట మండల కేంద్రంలోని గిరిజన భవన్లో ఈనెల 28న చలో భద్రాచలం ధర్మ యుద్ధం పై అశ్వారావుపేట ఆదివాసి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం జేఏసీ నాయకుల సమావేశం.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆదివాసి ఐక్యతతో కదిలి రావాలని ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు ధర్మ యుద్ధ పోరాటం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎస్టి చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించాలని ప్రతి ఒక్కరు ఉద్యమించాలని భవిష్యత్తు ఆదివాసి తరాలను కాపాడటాని కై ఆదివాసీ ధర్మ యుద్ధం ఉద్యమం ఉధృతం చేద్దామని పిలుపునిచ్చారు.