మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో త్రిబుల్ ఆర్ రైతులు ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరిగితే ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వం నుండి నిధులు రాకపోతే పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని కాళ్లభేరానికి తెచ్చానని గుర్తు చేశారు. త్రిబుల్ ఆర్ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.