పట్టుదలతో శ్రమిస్తే ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారని సిద్దిపేట జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకట్ నరసయ్య, అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ అన్నారు. సోమవారం సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు కేటగిరీలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికలలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకట నరసయ్య, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వరులు పాల్గొని ఈవెంట్ ను ప్రారంభించారు.