మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో కలసి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి లేపాక్షి దుర్గా పాపనాశశ్వర వీరభద్ర స్వామి దేవాలయాన్ని సందర్శించారు. అక్కడికి విచ్చేసిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డికి ఆలయ పూజారులు పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే మాజీ మంత్రికి వేడ పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ దేవాలయంలో నిర్మించిన లేపాక్షి వీరభద్ర ఆలయ అద్భుత కట్టడాలు శిల్పాలు వాటి యొక్క వివరాలు అరియు మరియు ఆలయ ప్రతిష్ట విశేషాలను చరిత్రకారుడు రఘురామ ద్వారా తెలుసుకున్నారు