భీమడోలు మండలంలో సార్వసాగుకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని ఏవో ఉషారాణి తెలిపారు. మంగళవారం భీమడోలు మండలంలోని సొసైటీలను ఏవో సందర్శించి యూరియా పంపిణీ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. భీమడోలు మండలంలోని మొత్తం 5సొసైటీలు, 14 షాపుల్లో 90మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.