బహుజన రాజ్యస్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.గురువారం పాల్వంచ పట్టణ కార్యక్రమంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 85 శాతానికి పైగా జనాభా ఉన్న బహుజనులు అందరూ ఏకతాటిపైకి రావాలని కోరారు.అగ్రవర్ణాల కనుసన్నల్లో నడిచే పార్టీల్లో కార్యకర్తలుగా ఉండి,కార్యకర్తలుగా మిగిలిపోయే రోజులు పోయాయని,ఒక నిర్దేశిత లక్ష్యంతో ఏర్పడిన పార్టీ జేబీపీ అని అన్నారు..