కేసీఆర్ పై విచారణ అంటేనే తెలంగాణ రైతాంగాన్ని అవమానించినట్లు అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. సోమవారం తుంగతుర్తిలో కేసీఆర్ పై సీబీఐ విచారణకు ఆదేశించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కార్యకర్తలతో కలిసి రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కావాలనే కేసీఆర్ పై కుట్రలు చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లో నడుస్తున్నారన్నారు.