లక్ష్మిదేవిపల్లి మండలంలోని శేశాగిరినగర్ గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపికైన దుర్గాంబిక గ్రామ సంఘంలోని అరుణోదయ గ్రామ సమాఖ్యలోని ప్రణజ కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సోమవారం సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో తొలిసారిగా కౌజు పిట్టల పెంపకం యూనిట్‌ను ప్రారంభించినందుకు మహిళా సంఘాలను అభినందించారు. ప్రతి మండలంలోని మహిళా సంఘాల సభ్యులు కూడా కౌజు పిట్టలను పెంచుకోవాలని, దాని ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.