సాగు భూమి సామర్థ్యం మేరకు రైతులకు సూచించిన మోతాదులోనే యూరియా వాడాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. యూరియా వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ వెంకట మురళి మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత రానివ్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. నియమితులైన ఎన్ఫోర్స్మెంట్ టీంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో పక్కాగా విధులు నిర్వహించాలన్నారు.