ఏలూరు జిల్లా ఏలూరు కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల వరకు జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల సమస్యలపై వచ్చి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రి రెడ్డి, రెవిన్యూ అధికారులు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలపై వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు