నేపాల్ అల్లర్లలో చిక్కుకున్న 215 మంది తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు తేవడంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని చీరాల టిడిపి అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ కొనియాడారు.ఆపద సమయాల్లో ప్రజలకు అండగా నిలబడడంలో తండ్రి,సి.ఎం చంద్రబాబు అడుగుజాడల్లో లోకేష్ పయనిస్తున్నారని ఆయన శుక్రవారం మీడియాకు చెప్పారు.తామంతా కూడా లోకేష్ బాటలోనే నడుస్తామని మహేంద్రనాధ్ చెప్పారు. మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు,ఎ.ఏం.సి చైర్మన్ కౌతరపు జనార్ధన్ కూడా పాల్గొన్నారు.