అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని పులిగుట్టపల్లి పెద్ద తండా గ్రామానికి చెందిన బి.రామ్లా నాయక్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. మంగళవారం బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుంతకల్లు మండల పరిధిలోని పులిగుట్టపల్లి పెద్ద తండా గ్రామానికి చెందిన రామ్లానాయక్ హైదరాబాద్ కు వెళ్లేందుకు తన భార్యతో కలిసి గ్రామం నుంచి గుంతకల్లు రైల్వే స్టేషన్ కు ద్విచక్రవాహనంలో బయలుదేరారు. అయితే మల్లెనుపల్లి-దోనిముక్కల గ్రామాల మధ్యలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వారి ద్విచక్రవాహనానికి అడ్డు పడి బండరాయితో దాడి చేశారు