కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కరీంనగర్ జిల్లా వైద్య అధికారి వెంకటరమణ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాలను అన్ని గదులను తనిఖీ చేశారు. అక్కడికి వచ్చిన రోగులతో మాట్లాడి, అందుతున్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిలో రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.