విశాఖ స్టీల్ ప్లాంట్ లోని సి డి సి పి విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు సిహెచ్ అప్పలనాయుడు ఎత్తునుంచి పడటంతో మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ లోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెదగంటి పరిధిని అదుపులో నివాసం ఉంటున్న అప్పలనాయుడు యధావిధిగా శనివారం ఉదయం హాజరయ్యాడు టిడిపి విభాగంలో పని చేస్తుండగా అతను నిలబడి ఉన్న రేకు డ్యామేజీ కావడంతో విరిగిపోయింది. దీంతో ఎత్తి నుంచి పడిపోయి అక్కడికక్కడే మరణించాడు. స్థానికులు జనరల్ హాస్పిటల్ కి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.