మహానంది మండలం గాజులపల్లె సమీపంలో రెండు బైకులు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..బీరవోలుకు చెందిన తలారి వేణు గాజులపల్లెలో జరుగుతున్న పెళ్ళికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తలారి వేణు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయని తెలిపారు. మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.