అమరాపురం మండల కేంద్రంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆదివారం అన్నదాత పోరు కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో మడకశిర వైసిపి ఇన్చార్జ్ ఈర లక్కప్ప ముఖ్యఅతిథిగా పాల్గొని ఈనెల 9న పెనుకొండ ఆర్డీవో కార్యాలయం వద్ద అన్నదాత పోరు ముట్టడి కార్యక్రమానికి తరలిరావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.