సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ కొడకంచి గ్రామంలో ఆదివారం సాయంత్రం గణేష్ నిమజ్జనం ఘనంగా జరిగింది. అమ్మ చెరువులో మేళతాళాల నడుమ గణనాథుని నిమజ్జనం చేశారు. రామేశ్వరం బండ గ్రామం నుంచి తరలివచ్చిన భక్తులు, మండప నిర్వహకులు మాట్లాడుతూ...5 రోజులపాటు లంబోదరుడిని ప్రత్యేక పూజలు నిర్వహించి, గంగమ్మ ఒడికి స్వామివారిని చేర్చారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులకు, పోలీస్ సిబ్బందికి, కృతజ్ఞతలు తెలిపారు.