పాతబస్తీలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. ఫలక్నుమా PS పరిధిలోని రవీంద్రనాయక్ కాలనీలో ఏర్పాటు చేసిన గణేశ్ పండల్ సమీపంలో విద్యుత్ షాక్ తగలడంతో భరత్ (33) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న ఫలక్నుమా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.