విశాఖ సాగర్ తీరా ప్రభుత్వ భూములను విదేశీ ప్రైవేట్ సంస్థ లుకు మాల్ కు కేటాయింపు పై ప్రజా అభిప్రాయ సేకరణ కార్యక్రమం విశాఖ ఆర్కే బీచ్ వద్ద శనివారం విశాఖ ప్రజా వనరుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగింది. విశాఖ ప్రజా వనరుల పరిరక్షణ వేదిక కన్వీనర్ రాణి శర్మ హాజరై ముందుగా కరపత్రాలను ఆవిష్కరించారు.. సందర్భంగా రాణి శర్మ మాట్లాడుతూ ఎన్నో కోట్ల రూపాయల ప్రభుత్వ విలువైన భూములను ఇలా ప్రైవేటుపరం చేసి ప్రైవేటు వారికి దానధత్వం చేయడం ఎంతవరకు సమంజసం అని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు కార్యక్రమములో సిపిఐ నాయకులు పైడ్రాజు,AISF డిస్ట్రిక్ట్ సెక్రటరీ నాగరాజు పాల్గొన్నారు