మినిస్టరీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ అఫైర్స్ న్యూఢిల్లీ వారి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఐటీడీఏ పరిధిలోని మారుమూల ప్రాంతంలోని 19 మండలాలలోని 130 గ్రామాలలో ఆది కర్మయోగి అభియాన్ పథకమును ఈ నెల 23 నుండి 30 వరకు ఆయా గ్రామాలలో ఆది సేవ కేంద్రాలు ప్రారంభించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించి గ్రామములోని సమస్యలు తెలుసుకొని ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ బుధవారం తెలిపారు.