అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని పలు గ్రామాల్లో భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తూ కోలాటలాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమాలను సేవా కమిటీ సభ్యులు చవితి వేడుకల నిర్వాహకులు నిర్వహించారు. శుక్రవారం బెలుగుప్ప మండలంలో బెలుగుప్ప నక్కలపల్లి గుండ్లపల్లి దుద్దేకుంట గంగవరం బ్రాహ్మణపల్లి బ్రాహ్మణపల్లి తండా యలగలవంక, విరుపాపల్లి , శీర్పి, కాలువపల్లి, హనుమ రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో వినాయకుని వచ్చిన కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. బ్రాహ్మణపల్లి తాండా వద్ద చెరువులో అధికారులు క్రేన్ ఏర్పాటుచేసి నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారు.