పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో ఎంపీటీసీ బొల్లంపల్లి శ్రీనివాస్ చౌదరి అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ, వైసిపి కార్యకర్తల సమావేశం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా వైసిపి భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు, గూడూరి ఉమాబాల, చవ్వాకుల సత్యనారాయణ, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అండలూరు గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు తదితరులు హాజరయ్యారు.