మాదాపూర్ లోని కృష్ణా కిచెన్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ లో మంటలు వ్యాపించడంతో పై కప్పు నుంచి దట్టమైన పొగలు బయటకు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం కస్టమర్లను బయటకు పంపి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అగ్ని ప్రమాద ఘటన సమాచారం అందడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదం లో ఎవరికి ఎలాంటి ప్రమాదమూ జరగకపోవడం తో అంతా ఊపిరి పీల్చుకున్నారు