వినాయక చవితి పర్వదినం సందర్భంగా గణేష్ మండపాల వద్ద నిబంధనలకు అనుగుణంగా కమిటీ సభ్యులు నడుచుకోవాలని ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు అన్నారు. ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం సాయంత్రం గణేష్ మండపాల కమిటీ సభ్యులతో సీఐ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మండపాల వద్ద నిరంతరం కమిటీ సభ్యులు ఉండేలా చూడాలన్నారు. అలాగే తప్పనిసరిగా అనుమతి పొంది గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.