కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం పిచ్చి కుక్క దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. రామా థియేటర్ సెంటర్ నుంచి అనఘా దత్త క్షేత్రం మధ్య వెళ్తున్నవారిపై ఓకుక్క దాడి చేసిందని స్థానికులు వాపోయారు.బాధితులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.