ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం కొమ్ముచిక్కల టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ 88 మంది లబ్ధిదారులకు రూ.48,11,983 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ను పక్కదారి పట్టించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కోట్లాది రూపాయల చెక్కులను అందించామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.