ఒంగోలులో గ్యాస్ లీక్ అయిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళ విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించింది. సీనియర్ జర్నలిస్టు మాల్యాద్రి కోడలైన శిరీష ఈనెల 14న వంట గదిలో గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని గుర్తించక కరెంటు స్విచ్ వేయడంతో మంటలు ఎగిసి తీవ్రంగా గాయపడింది.అప్పటినుండి విజయవాడలో చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచింది. ఈ మేరకు ఒంగోలు పోలీసులకు సమాచారం అందడంతో వారు కేసు నమోదు చేశారు