నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం, గూడూరు గ్రామంలో తెలంగాణ సాయుధ రహితంగా పోరాట వారోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అంటే నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా, భూమికోసం, భుక్తి కోసం, రాజకీయ విముక్తి కోసం జరిగిన పోరాటమని తెలిపారు. అలాంటి పోరాటాన్ని కొందరు బిజెపి నాయకులు హిందువులకు, ముస్లింలకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. బిజెపి నాయకులు ఏనాడు ఏ పోరాటంలో పాల్గొనలేదని అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు.