అంబేడ్కర్ చిత్రపటానికి అవమానం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామపంచాయతీలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటాన్ని పంచాయతీ కార్యాలయంలో మూలన పడేయడంపై అంబేడ్కర్ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిగతా మహనీయుల చిత్రపటాలు గోడలకు బిగించి ఉండగా, అంబేడ్కర్ చిత్రపటాన్ని పక్కన పెట్టడం ఆయనను అవమానించడమేనని వారు పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.