పెద్దపంజాణి: మండల పోలీసు వర్గాలు తెలిపిన సమాచారం మేరకు. బట్టందొడ్డి గ్రామ వద్ద అయ్యప్ప స్వాములు పూజలు నిర్వహించుకుని ఆలయం వద్ద నుండి బయటకు వస్తుండగా, పలమనేరు నుంచి మదనపల్లి వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం అతివేగం గా వచ్చి అదుపుతప్పి స్వాములపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అయ్యప్ప స్వాములు వినయ్ కుమార్, ప్రకాష్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని వెంటనే హైవే ఆంబులెన్స్ సిబ్బంది ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రకాష్, పరిస్థితి విషమించడంతో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మరణించారని తెలిపారు.