నేరడిగొండ మండల కేంద్రంలోని ఓ వైన్స్ లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది.పట్టణంలో ఉన్న వరుణ్ లిక్కర్ మార్ట్ వైన్స్ శాపులో రాత్రి గుర్తుతెలియని దుండగులు చొరబడి మద్యం సీసాలను చోరీ చేశారు.మద్యం బాటిల్స్ తో పాటు నగదు అపహరణకు గురైందని వైన్స్ నిర్వాహకుడు తెలిపాడు.ఐతే మద్యం సీసాలు వున్న కొన్ని కార్టున్ డబ్బాలను మద్యం దుకాణం సమీపంలో వేసి మరోసారి వచ్చి తీసుకు పోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సిసి ఫుటేజీని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.