తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని టోల్ గేట్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు నుంచి చెన్నైకి వెళుతున్న ప్రైవేట్ బస్ ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్పై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.