విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం రెండు సంవత్సరాలు కిందట డిడి చెల్లిస్తే ఆరు నెలల కిందట మెటీరియల్ ఇచ్చిన అధికారులు కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ రైతు సోమవారం మధ్యాహ్నం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ధర్మవరం మండలం రేగాటిపల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి, విశ్వనాథరెడ్డి అనే రైతు మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కావాలంటే నియోజకవర్గానికి చెందిన జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డిని కలవాలని విద్యుత్ అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు.