నందవరంలో వర్షం వల్ల ఇబ్బందులు..నందవరంలో బుధవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ వర్షం కురవడంతో పలు వీధుల్లో రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు నీటితో నిండిపోయాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా వినాయక మండపాల్లోకి నీరు చేరడంతో వినాయక మండప నిర్వాహకులు ఇబ్బందులు పడ్డారు.