నందవరంలో పాము కాటుకి రైతు మృతి.!నందవరంలో రైతు కుటుంబానికి చెందిన రాజోలీ చిన్న తిమ్మప్ప కుమారుడు ఆంజనేయులు (37) పాముకాటుకి బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సోమవారం పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటువేసింది. చికిత్సకోసం కర్నూల్లో ఆసుపత్రికి తరలించారు. బుధవారం చికిత్స పొందుతూ మృతి చెందాడని, మృతుడికి భార్య ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.